జమ్మికుంట: బస్టాండ్ సమీపంలోని ఫ్లైఓవర్ ముందు సోమవారం మధ్యాహ్నం ఓ ఆర్టీసీ బస్సు ఇంజన్ లో సమస్య తో నిలిచిపోయింది. దీంతో ఇతర వాహనాలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది హుజురాబాద్ నుండి జమ్మికుంటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగుతున్న సమయంలో ఇంజన్ లో సమస్య తలెత్తడంతో బస్సు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్టాండ్ నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి వైపు వాహనాలు ఎక్కకుండా కింది నుండి దారి మళ్లించారు దీంతో కొంత ట్రాఫిక్ కు ఉరుట కలిగింది. అయితే ఆర్టీసీ బస్సును అక్కడి నుండి తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.