పెద్ద కడబూరు:గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీడీవో ప్రభావతి దేవి ఆదేశించారు. బుధవారం పెద్ద కడబూరు మండలం పీకలబెట్ట, బాపులదొడ్డి, గవిగట్టు గ్రామాల్లో పర్యటించి సచివాలయ సిబ్బంది, సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హితవు పలికారు. GSWS యాక్టివిటీస్ సర్వేను నిర్వహించాలన్నారు.