దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలను, ఆర్థిక స్థితిగతులను పరిశీలించిన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం 2 జీఎస్టీ స్లాబ్ లను ప్రకటించడం హర్షించదగ్గ విషయమని బిజెపి జిల్లా అధ్యక్షుడు వై బాబు అన్నారు.శుక్రవారం మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్మల సీతారామన్ ఆర్థిక మంత్రిగా పేద మధ్యతరగతి ప్రజల సౌలభ్యం కోసం రెండు స్లాబులు ప్రకటించడం అన్ని వర్గాలకు ఊరటనిస్తుందని అన్నారు. విలేకరుల సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు