ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, వంట సరుకులు, కూరగాయలు, తరగతి గదులు, హాజరు పట్టికలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని తెలిపారు.