శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కమ్మవారిపల్లిలో పంచాయతీ సెక్రటరీ ఫరూక్ అబ్దుల్లా, ఇంజినీరింగ్ అసిస్టెంట్ బాలాజీ ఇద్దరూ కొట్టుకున్నారు. సోమవారం మధ్యాహ్నం పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ అసిస్టెంట్తో కలిసి సోమవారం కమ్మవారిపల్లి ఎస్సీ కాలనీలో సర్వే చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో మాటమాట పెరగ్గా బాలాజీ తనను కింద పడేసి కొట్టినట్లు తెలిపారు. చేయి విరగడంతో గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు.