కూటమి ప్రభుత్వం టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మకు ఇద్దరు గన్మెన్లను కేటాయించింది. ఆయనకు త్వరలో కేబినెట్ పదవి లభించనుందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ గన్మెన్ల కేటాయింపు ప్రాధాన్య తను సంతరించుకుంది. గురువారం నాడు గన్మెన్లు వర్మను కలిసి తమ బాధ్యతలను స్వీకరించారు.