రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వలన పేదలకు, వెనుకబడిన వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం బి.ఎస్.పి ఇన్చార్జ్ జుత్తుక నాగేశ్వరరావు జగ్గంపేటలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని, పేద, వెనుకబడిన వర్గాల విద్యార్హతలకు ఉచిత వైద్య హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.