రాజవొమ్మంగి మండలంలోని లాగరాయి, కిండ్ర, లబ్బర్తి గ్రామాల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం గుర్తించి పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించమని అదే సమయంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా తమ పరిసరాల్లో, ప్రాంతంలో పారిశుద్ధ్యం లోపం లేకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి లోపల కూడా మలేరియా మందు పిచికారి చేయించుకోవాలని సూచించారు.