చోడవరం నుంచి విశాఖపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సు పెందుర్తి పరిధి పెనుగాడి జంక్షన్ లోకి వచ్చేసరికి ఓ వ్యక్తి గుండె పోటు తో మరణించిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు కి వెళ్తే బుచ్చయ్యపేట మండలానికి చెందిన పీ రాజేష్ చోడవరం నుంచి విశాఖ వస్తుండగా ఆర్టీసీ బస్సులో అపస్థితికి చేరుకున్నాడని స్థానికులు గుర్తించి సిబ్బందికి తెలియజేశారు. ఆర్టీసీ సిబ్బంది అప్పటికప్పుడు సీఆర్పీ చేసి పిహెచ్సి కి తరలించారు అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.