ఆదిలాబాద్ జిల్లా ప్రజలు టీబీ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా టీబీ నివారణ అధికారి డా. సుమలత అన్నారు. గురువారం నేరడిగొండ మండలంలోని వాడూర్ గ్రామంలో టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుమలత మాట్లాడుతూ... టీబీ వ్యాధి సోకిన వారు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైద్యులు సూచించిన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి నియమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఐఓ పవార్ రవీందర్, మౌనిక, దేవిదాస్, శ్రీనివాస్, జగదీష్ రెడ్డి, సంగీత పాల్గొన్నారు.