నాగలాపురం: రాణమ్మకు మాజీ మంత్రి ఆర్కే రోజా శ్రద్ధాంజలి నాగలాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ వైసీపీ నేత చిన్నదొరై సుధాకు పెద్దమ్మ రాణెమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. స్థానిక పడమటి దళితవాడలో రాణమ్మకు బుధవారం కర్మక్రియలు జరిగింది. మాజీ మంత్రి ఆర్. కె. రోజా, సత్య వేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ హాజరై రాణెమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంభ సభ్యులను పరామర్శించారు. వైసీపీ నేతలు ఆమె వెంట పాల్గొన్నారు.