బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో చైతన్య యాత్ర కరపత్రాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు శుక్రవారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 584 మండలాలలో చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన కరపత్రాన్ని ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న ఎల్బీనగర్ లోని శ్రీకాంత చారి విగ్రహం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని అన్నారు.