యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కాట్రేనికోన ఎస్సై అవినాశ్ పేర్కొన్నారు. బుధవారం ఉప్పుడిలోని ఒక స్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల జరుగుతున్న దుష్పరిణామాలు వివరించారు. యువత చదువుపై మొగ్గు చూపాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ విద్యార్థుల చేత నినాదాలు చేయించారు.