ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం పట్టణం సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, అనంతరం రెండో పట్టణ సీఐకు ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు, మహిళా నేతలు పాల్గొన్నారు.