అన్నదమ్ముల కలిసిమెలిసి జీవిస్తున్న దళితుల మధ్య కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో తీసుకువచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమారుడు డిమాండ్ చేశారు ఆదివారం రాజమండ్రి లో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా మాల ఉద్యోగుల సంఘం, జిల్లా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ర్యాలీ గోకవరం బస్టాండ్ నుండి క్వారీ సెంటర్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు మాల సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.