తాడిపత్రిలో గత వైసీపీ ప్రభుత్వం అమాయకులపై కేసులు పెట్టిందని అసెంబ్లీలో MLA జేసీ అస్మిత్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. తనపై, తన తండ్రిపై 200 కేసులు ఉన్నాయని, వాటి గురించి తీయమని అడగక్కర్లేదని చెప్పారు. వేసవికాలంలో కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి తండ్రి జెండా పట్టారంటూ సీటు తొలగించారని, ఐటీ ఉద్యోగులకు ఉద్యోగం తీసేశారని ఆరోపించారు.