ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై బాప్టిస్ట్ పాలెం వాసులు నీటితో ఇబ్బంది పడుతున్నామని రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. విషయం తెలుసుకున్న పొదిలి ఎస్ఐ వేమన సంఘటన ప్రాంతానికి చేరుకొని వారికి సర్ది జెప్పి నిరసన నిర్వహింప చేశారు. అనంతరం ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.