చిట్వేల్ మండలం ఎస్. అగ్రహారం లో గురువారం వైయస్సార్ పార్టీ ని వీడి పలువురు ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరారు. రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వారికి పసుపు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపి కీలక నేత పాటూరు శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో చిట్వేల్ ఎంపీటీసీ బండారు గుండయ్య, కేఎస్ అగ్రహారం ఎంపీటీసీ మొట్టయ్యగారి సుబ్రహ్మణ్యం రెడ్డి, కంప సముద్రం ఎంపీటీసీ తుంగ కోటేశ్వర్ నాయుడు, కేఎస్ అగ్రహారం సర్పంచ్ చేతిపట్టు ప్రసాద్ రెడ్డి, తుమ్మకొండ సర్పంచ్ పులిగంటి రెడ్డయ్య టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.