తొండమాన్ పురంలో వేంకన్న కళ్యాణోత్సవం తొండమాన్ పురంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల రెండో శనివారం కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఇవాళ కన్నుల పండువగా కళ్యాణోత్సవం నిర్వహించారు. స్థానికులు మాట్లాడుతూ.. ఇది వరకు తిరుమలలో వేంకన్న కళ్యాణోత్సవానికి ఆన్లైన్లో టికెట్లు దొరికేవి కావని, ఇప్పడు తమ గ్రామంలోనే స్వామి వారి కళ్యాణం జరగడం సంతోషంగా ఉందన్నారు.