విభిన్న ప్రతిభావంతుల నాయకులు సోమవారం సబ్ కలెక్టర్ కు ఇవ్వనున్న అర్జి : విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవాసమితి అధ్యక్షుడు సుబ్బ నర్సారెడ్డి ఇటీవల జరిగిన పెన్షన్ల ఏరివేతలో భాగంగా డాక్టర్ల అలసత్వం కారణంగా అనేకమంది నిజమైనటువంటి అర్హత కలిగిన దివ్యాంగులు తమ యొక్క పెన్షన్ ని పోగొట్టుకోవడం జరిగింది. దీనికి నిరసనగా సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు ఉదయం 10 గంటలకు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని మండలాలు మరియు రాజంపేట పరిధిలో ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి మీ పెన్షన్ తొలగించబడ్డారో వారు ఖచ్చితంగా మీయొక్క సదరం, ఆధార్, నోటీసు పేపర్, రెండు ఫోటోలను తీసుకొని రావాలి.