రేషన్ కార్డులలో పేర్లు యాడింగ్ అప్రూవల్, పింఛన్లు ఇవ్వకుంటే పోరాటమే సత్తుపల్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని సీపీఎం వేంసూరు మండల కమిటి సభ్యులు మల్లూరు చంద్రశేఖర్ అన్నారు.ఆదివారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో కొండ్రు శ్రీను అధ్యక్షతన జరిగిన సీపీఎం శాఖ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రేషన్ కార్డులలో నూతన పేర్లు యాడ్ కోసం దరఖాస్తు చేసి నెలలు గడిచినా జిల్లా అధికారులు అప్రూవల్ ఇవ్వడం లేదని ఇవ్వకుంటే పోరాటం చేస్తామన్నారు.అంతే కాకుండా మూడేళ్ళు నుండి వృద్ధులు,వికలాంగులు,వితంతువులు నూతన ఆసరా పింఛను ల కొరకు దరఖాస్తులు చేసి ఎదురు చూస్తునారు