వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన బిజెపి నాయకులు మాజీ సొసైటీ చైర్మన్ సుభాన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిజెపిని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు, ప్రస్తుతం ఇవి లేవని టిఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.