రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతుకు మునుపెన్నడూ లేని విధంగా నిధులు కేటాయించడం జరిగిందని ఈ నిధులను పారదర్శకంగా సద్వినియోగం చేసి వసతి గృహ మరమ్మత్తులను చేపట్టేందుకు ఇంజనీరింగ్ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేసేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరం నందు సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు సంబంధించి సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులైన పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యు ఎస్, సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.