చిత్తూరు ప్రజల క్షేమార్థం హిజ్రాలు చిత్తూరు నగరం గిరింపేటలో వెలసిన శ్రీ దుర్గాంబవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక చౌడేశ్వరమ్మ ఆలయం నుంచి సారె తీసుకెళ్లి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ప్రజలకు అన్నదానం చేశారు. సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ తమకు నగదును అందించే వ్యాపారస్తులు, ప్రజల మేలు కోరుతూ ఏటా దుర్గమ్మ వారికి పూజలు నిర్వహించడం సంప్రదాయంగా జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారికి పూజలు చేసి అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు. చిత్తూరు ప్రజలందరూ బాగుండాలని, అందులో తాము ఉండాలని వారు ఆకాంక్షించారు.