నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ మొబైల్ నంబర్ 9100577132 లో సంప్రదించాలని కోరారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గురువారం విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.