జిల్లా కలెక్టరేట్ ను నరసాపురం రెవెన్యూ డివిజన్ కు తరలించాలంటూ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు భీమవరం లో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన నరసాపురం రెవిన్యూ డివిజన్లో జిల్లా కలెక్టరేట్లు తరలించాలని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ , మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు ఇతర కూటమి నాయకులు కోరారని దీనిపై సమాలోచన చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు.