పల్నాడు జిల్లా,మాచర్ల లోని శ్రీశైలం రోడ్డు లో యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు.బుధవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,మృతుడు మాచర్ల 8వ వార్డుకు చెందిన చంద్రశేఖర్, అలియాస్ బాబు గా గుర్తించారు.బండరాయితో గుర్తు తెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మృతుడు చంద్రశేఖర్ వెల్డింగ్ పనులు చేస్తూ, లారీ డ్రైవర్ గా కూడా పనిచేస్తుంటాడన్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.