మక్తల్ నారాయణపేట కొడంగల్ భూ నిర్వాసితులను ఆదుకోవాలని ఈనెల 8 వ తేదీన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామం నుండి దామరగిద్ద వరకు జరిగిన పాదయాత్రను పోలీసులు గడి మున్కన్ పల్లి గ్రామం దగ్గర అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు రైతులకు వాగ్వాదం జరిగింది. దామరగిద్ద పోలీసులు మంగళవారం 10 ఈ గం అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి అనంతరం స్టేషన్ బెయిల్ పై విడుదల చేసినట్లు భూ నిర్వాసితుల జిల్లా గౌరవ అధ్యక్షులు జి.వెంకట్రామ రెడ్డి అన్నారు. రైతులకు సరైన పరిహారం చెల్లించాలని కోరితే అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.