పత్తికొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ సత్య నారాయణరెడ్డి గురువారం తెలిపారు. వాతావరణ మార్పులతో పిల్లల్లో దగ్గు, జలుబు, టైఫాయిడ్, డెంగ్యూ, జాండీస్ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నందున వినియోగించుకోవాలని కోరారు.