కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో గురువారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. రాజాంపేట మండల ఎంపీడీవో బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థల విద్యార్థులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.తలమడ్ల జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రమదానం చేసి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అధికారులు విద్యార్థులకు సూచించారు.