రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలోని గ్రామ సచివాలయం మందుబాబులకు అడ్డాగా మారింది. సచివాలయం నిర్మాణం పూర్తి కాకపోవడంతో మందుబాబులు రాత్రి పగలు అని తేడా లేకుండా సచివాలయంలోనే మందు తాగేస్తున్నారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. సచివాలయాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.