సూర్యాపేటలోని విలీనమైన గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి విమర్శించారు. ఈ సందర్భంగా కోమటికుంటలో ప్రజా సమస్యలపై సిపిఎం నిర్వహించిన సర్వేలో ఆయన పాల్గొని మాట్లాడారు. విలీన గ్రామాల అభివృద్ధి పై మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.మురికి కాలువలు అంతర్గత రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.