అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం బస్సు పాసులు కోసం పలువురు దివ్యాంగులు వచ్చారు. అయితే మధ్యాహ్నం రెండు గంటలైనా బస్సు పాసుల కౌంటర్ ఓపెన్ చేయలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి వేచి ఉన్న బస్సు పాసులు కౌంటర్ ను ఓపెన్ చేయలేదని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు.