ఇవ్వాళ మహానేత YSR 16 వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి షర్మిల నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. YSR ది అద్భుతమైన జీవితం అన్నారు. మరణించి 16 ఏళ్లు అయినా నేటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఆరోగ్య శ్రీ,ఉచిత విద్యుత్,ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాలు YSR గుండెల్లోంచి పుట్టిన పథకాలు అని చెప్పారు. YSR కి ఇంత ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. YSR చనిపోయాక ఆ బాధను జీర్ణించలేక 700 మంది చనిపోయారని అన్నారు.