రేణిగుంట వసతి గృహ పరిశుభ్రతపై అవగాహన రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని బి.సి. బాలుర వసతి గృహాన్ని డిప్యూటీ డెమో కిరణ్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ కామరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరిశుభ్రత, చేతులు శుభ్రం చేసుకోవడం, సురక్షిత నీరు, డ్రైడే పాటించడం, వ్యాధుల నివారణపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.