తిరుపతి జిల్లా తడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నెం 2 వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని ఆన్ డ్యూటీ తడ రైల్వే స్టేషన్ మాస్టర్ గురువారం గుర్తించారు. ఈ మేరకు రైల్వే శాఖ పోలీసులకు ఆయన సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి సుమారు 45 ఏళ్ల లోపు ఉండవచ్చు అని తెలియజేశారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, అయితే మృతి చెందిన వ్యక్తి తెలుపు రంగుపై నీలం రంగు పెద్దగళ్ళ చొక్కా, మెరూన్ ఫుల్ డ్రాయర్ ధరించి ఉన్నాడని ఆన్ డ్యూటీ తడ రైల్వే స్టేషన్ మాస్టర్ తెలిపారు. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట జిఆర్ పిఓపి హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు సంఘట