ప్రకాశం జిల్లా కొత్తపట్నం పోలీస్ స్టేషన్ ని శుక్రవారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. దొంగతనాలు రోడ్డు ప్రమాదాలు అరికట్టే అంశంలో ఎస్పీ దామోదర్ పోలీసు సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో కొత్తపట్నం సముద్ర తీరానికి వస్తున్న పర్యటకుల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.