యూరియా బస్తాలు ఇప్పించాలని ఓ రైతు కలెక్టర్ కాళ్లు మొక్కిన ఘటన ములుగు జిల్లాలో నిన్న చోటుచేసుకుంది. ములుగులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కలెక్టర్ దివాకర్ టిఎస్ నిన్న తనిఖీ చేశారు. పీఏసీఎస్ లో ప్రస్తుతం 1200 బస్తాల స్టాక్ ఉందని, అదనంగా మరో వెయ్యి బస్తాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. అక్కడికి చేరుకున్న రైతులు సరిపడా యూరియా ఇవ్వట్లేదని కలెక్టర్ కు తమ గోడును వినిపించారు. అందులో ఓ రైతు కలెక్టర్ కాళ్ల మీద పడి యూరియా ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో కలెక్టర్ రైతుకు యూరియా ఇస్తామని సర్ది చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో నేడు శుక్రవారం రోజున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.