చాకలి ఐలమ్మ స్ఫూర్తితో భూ పోరాటాలు ఉధృతం చేయాలని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఏటూరునాగారంలో ఆయన మాట్లాడుతూ.. ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పనిచేసిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భూ పోరాటాలను ఉదృతం చేయాలన్నారు.