మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మాయిపల్లి సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గౌరవ్ (32), దుర్మరణం చెందాడు. కాపురాలని ఎల్లారెడ్డి గూడాకు చెందిన గౌరవం తన కారులో తిమ్మాయిపల్లి నుండి కీసర వైపు వెళుతుండగా ఊరి శివారులో ఎదురుగా అతివేగంతో నిర్లక్ష్యంగా వచ్చిన టిప్పర్ డ్రైవర్ అతని కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గౌరవను గాంధీ ఆసుపత్రికి తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.