వినాయక చవితి పర్వదినం సందర్భంగా గంట్యాడ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ బుధవారం మధ్యాహ్నం గణపతి ఉత్సవాలనుఅత్యంత వైభవంగా ప్రారంభించారు. మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో పోటాపోటీగా గణేష్ ఉత్సవ మండపాలను ఏర్పాటు చేసి, విభిన్న ఆకృతులు కలిగిన భారీ సైజు గణపతి బొమ్మలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవ మండపాల వద్ద ప్రతిష్టించి చవితి పూజలు నిర్వహించారు. ఇక వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజానీకం ఇళ్లల్లో మట్టి గణపతిలను ప్రతిష్టించి ఇంటిళ్లపాది భక్తిప్రపత్తులతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.