వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రతతోనే వ్యాధుల బారిన పడకుండా ఉండగలమని మేయర్ ఎస్ అముద చెప్పారు. "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా శనివారం చిత్తూరు నగరపాలక పరిధిలో "మాన్ సూన్ హైజిన్" అంశంపై ప్రత్యేక అవగాహన, ర్యాలీ, దోమల నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, ఇన్చార్జి కమిషనర్ వెంకటరామిరెడ్డి, సహాయ కమిషనర్ ఎ ప్రసాద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్వో డా.పి.లోకేష్ పాల్గొన్నారు. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో నగరంలో ఎక్కడా నీటి నిల్వ