మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఉచితంగా యూరియా, విద్యుత్ అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కువగా యూరియా కొరత ఏర్పడిందని కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి యూరియాను దిగుమతి చేసుకోవాలని తెలియజేశారు.