తాళ్లపూడి మండలం లో వైరల్ ఫీవర్ నమోదైన ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరావు తెలిపారు. పక్కిలంక, వేగేశ్వరపురం గ్రామాలలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.