పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిథల్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ పార్లమెంట్-11 ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మక్తల్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, రిసెప్షన్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ అందజేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు తప్పక పాటించాలని అన్నారు.