జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని న్యాయసేవ అధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. శనివారం ఉదయం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు.