బస్సు ఢీకొని భార్య మృతి రక్తస్రావంలో విలవిల్లాడిన భర్త గాయపడిన బాధితుడిని స్వయంగా ఆసుపత్రికి చేర్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒక క్షణం ఆలస్యం, ఒక వాహన నిర్లక్ష్యం – ఒక చిన్న కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచింది.రంగనాధపాలెం మండలం వెంకటాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం భయంకర దృశ్యాలకు వేదిక అయింది. ఏన్కూర్ మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన భార్య లక్ష్మితో కలిసి టూవీలర్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. అయితే వెనకనుంచి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కుటుంబం జీవితాలు క్షణాల్లో మారిపోయాయి.బస్సు టైరుకింద కొట్టుకుపోయిన లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.