ములుగు జిల్లా కేశవాపూర్ పిఎసిఎస్ కేంద్రం వద్ద గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం టోకెన్ తీసుకున్న రైతులు రాత్రి వరకు సైతం యూరియా అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చిన అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే యూరియా సకాలంలో అందించాలని కోరారు.