జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.గురువారం ఐడిఓసి లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖ, ఐసిడిఎస్ అధికారులతో జిల్లాలో మదకద్రవ్యాల నిర్మూలనపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు మానవులను మానసికంగా పశువుల స్థాయికి తీసుకువెళ్తాయని, మత్తు పదార్థాలకు బానిస వ్యక్తులు సమాజంలో అరాచకాలను సృష్టిస్తారని అన్నారు.