కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ కు ఆదివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ , ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట ప్రకారం కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. పిఆర్టియు సంఘం 72,000ల మంది సభ్యత్వంతో దేశంలోని అతిపెద్ద సంఘంగా కొనసాగుతుందన్నారు.